దేశ రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న బాలిక(5)ను హోంవర్క్ చేయలేదని ఆమె తల్లి కాళ్లూచేతులు కట్టేసి మండుటెండలో వదిలేసింది. ఎండలకు తాళలేక ఆ చిన్నారి పెడుతున్న కేకలు విని పొరుగింటి మహిళ తీసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి అకృత్యానికి పాల్పడ్డవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. నగరంలోని ఖజూరీ ఖాస్ ప్రాంతంలో జూన్ 2న ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.
పొరుగింటి నుంచి 25 సెకన్ల వీడియో తీసిన మరో మహిళ తీవ్రమైన ఎండలో, మధ్యాహ్నం 2.00 గంటల ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకొన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా.. దిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా, దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలీవాల్లకు ఓ వ్యక్తి ట్యాగ్ చేశారు. చిన్నారి తల్లిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
https://www.indiatoday.in/cities/delhi/story/delhi-news-mother-ties-child-hands-legs-house-roof-punishment-school-homework-1960003-2022-06-08?jwsource=cl