ఢిల్లీలో కరోనా టెర్రర్.. 24 గంటల్లోనే 1024 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీలో కరోనా టెర్రర్.. 24 గంటల్లోనే 1024 కేసులు

May 28, 2020

loki

ముందు జాగ్రత్త చర్యగా విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నా కరోనా మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు దేశంలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో ఒక్కరోజే 117 కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీలో కూడా నేడు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కేసులు పెరగుతున్నాయి. 

గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా మరో 1,024 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఢిల్లీలో మొత్తం 16,281 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కరోనాతో 13 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 316కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 7,495 మంది కోలుకున్నారని.. ప్రస్తుతం 8,470 మంది చికిత్స పొందుతున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఢిల్లీలో కేసులు పెరుగుతున్న క్రమంలో హరియాణా రాష్ట్రం మరోసారి ఢిల్లీ సరిహద్దులను మూసివేసింది.