Delhi's 1st Monkeypox Case: 31-Year-Old Man With No Foreign Travel History
mictv telugu

ఢిల్లీ వ్యక్తికి మంకీపాక్స్.. దేశంలో నాలుగుకు చేరిన కేసులు

July 24, 2022

దేశంలో మంకీపాక్స్‌ కేసులు నాలుగుకి చేరాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించారు. 31ఏళ్ల వ్యక్తికి తాజాగా మంకీపాక్స్‌ నిర్ధారణ అయింది. అయితే అతడికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేకపోవడం గమనార్హం. బాధితుడు ప్రస్తుతం ఢిల్లీలోని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతున్నాడని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జ్వరం, చర్మంపై దద్దుర్లతో అతడు దవాఖానలో చేరాడని తెలిపింది. అతడు ఇటీవలికాలంలో విదేశీ ప్రయాణం చేయలేదని అధికారులు చెప్పారు. అయితే అతడు కొన్నిరోజుల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో జరిగిన ఓ స్టేజ్‌ పార్టీకి హాజరయ్యాడని వెల్లడించారు.

కాగా కేరళలో ఇప్పటికే మూడు మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు దిల్లీలో బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా 16,000 మంది మంకీ పాక్స్‌ బారినపడ్డారు. ఈ వ్యాధి మొత్తం 75 దేశాలకు వ్యాపించింది. మరోవైపు మంకీపాక్స్‌ కేసులు పలు దేశాలకు వేగంగా విస్తరిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజా ఆరోగ్య అత్యవరసర పరిస్థితి విధించింది.