కావాలనే టార్గెట్ చేశారు : మంచు మనోజ్ - MicTv.in - Telugu News
mictv telugu

కావాలనే టార్గెట్ చేశారు : మంచు మనోజ్

March 21, 2022

 

‘మా’ ఎన్నికల సమయంలో తన అన్న మంచు విష్ణును కావాలనే కొందరు టార్గెట్ చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మనోజ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జీవితంలో ప్రతీ ఒక్కరూ మంచి లక్ష్యాలు కలిగి ఉండాలి. ఏదో ఒకటి సాధించాలన్న తపన లేకపోతే ఆ వ్యక్తి సమాజానికి ఇబ్బందికరంగా తయారవుతాడు. దీనికి నిదర్శనం మొన్న జరిగిన మా ఎన్నికలు. ఇరు పక్షాలు పోటీ పడినప్పుడు ఒకరు గెలుస్తారు. ఒకరు ఓడిపోతారు. విష్ణు గెలిస్తే బాగుంటుందని భావించారు కాబట్టే ఓటు వేసి గెలిపించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి విష్ణును మానసికంగా ఇబ్బంది పెట్టాలని రకరకాల కామెంట్లు చేశాడు. మేం ఆ వ్యాఖ్యలను పట్టించుకోకుండా గెలుపు మీద దృష్టి కేంద్రీకరించాం. గెలిచిన తర్వాత అయినా ఆ వ్యక్తి మారతాడేమోనని అనుకున్నా. మాకు నిరాశే ఎదురైంది. పక్కన గొప్ప క్యారెక్టర్లున్న వ్యక్తుల మధ్య ఉండి కూడా ఆ మనిషి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడని ఆలోచించా. ఇదే విషయం నాన్నను అడిగా. ఆ వ్యక్తికి జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు. అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆలోచిస్తే నిజమేననిపించింది’ అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, మనోజ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లోని ఓ పెద్ద కుటుంబంలోని వ్యక్తి గురించే అయి ఉంటుందని సినీ జనాలు చెవులు  కొరుక్కుంటున్నారు.