‘జలియన్‌వాలాబాగ్’కు ప్రధాని క్షమాపణ చెప్పాలి - MicTv.in - Telugu News
mictv telugu

‘జలియన్‌వాలాబాగ్’కు ప్రధాని క్షమాపణ చెప్పాలి

October 20, 2017

దాదాపు వందేళ్ల కిందట జలియన్‌వాలా బాగ్‌లో బ్రిటిష్ సైనికులు వందల మంది అమాయక ప్రజలను కాల్చి చంపినందుకు బ్రిటిష్ ప్రభుత్వం తరఫున ఆ దేశ ప్రధాని థెరిసా మే క్షమాపణ చెప్పాలని బ్రిటన్ పార్లమెంటులో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత సంతతి ఎంపీ వీరేంద్ర శ‌ర్మ దీన్ని తీసుకొచ్చారు. దీనికి మద్దతుగా ఐదుగురు ఎంపీల సంతకాలను కూడా ఆయన తీసుకున్నారు. 1919లో అమృత్‌సర్‌లో జనరల్ డయ్యర్ ఆదేశంతో పోలీసులు జలియన్ వాలా బాగ్‌లో సమావేశమైన ప్రజలను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపారు. ఈ ఘటనను భార‌తదేశ స్వతంత్ర పోరాటంలో కీలక ఘట్టంగా గుర్తించాలని వీరేంద్ర తన తీర్మానంలో డిమాండ్ చేశారు. 2019 నాటికి ఈ మారణకాండకు వందేళ్లే పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన తీర్మానాన్ని తీసుకొచ్చారు. బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని డేవిడ్ కామెరాన్ గతంలో భారతదేశానిక వచ్చినప్పుడు ఈ మారణకాండ బ్రిటిషర్లకు సిగ్గుచేటని అన్నారు.