‘ఆర్ఆర్ఆర్’ను నిషేధించాలంటూ డిమాండ్.. ఇంత అవమానిస్తారా? అంటూ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ను నిషేధించాలంటూ డిమాండ్.. ఇంత అవమానిస్తారా? అంటూ

March 23, 2022

07

భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ను తమ రాష్ట్రంలో నిషేధించాలంటూ కర్ణాటక వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రిరిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా చేస్తే మమ్మల్నే అవమానిస్తారా? అంటూ ‘బ్యాన్ ఆర్ఆర్ఆర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లో నిలుపుతున్నారు. విషయమేంటంటే.. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదులవుతోన్న ఈ చిత్రం ఆయా భాషల్లో డబ్బింగ్ చిత్రంగా రిలీజవుతోంది. కన్నడ భాషలో కూడా రిలీజవుతోంది. కానీ, బెంగళూరులో మాత్రం నిర్మాతలు కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. కన్నడ భాషలో ఒక్క థియేటర్‌లో కూడా రిలీజ్ చేయకపోవడం తమను అవమానించినట్టేనని కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందనా ఇప్పటివరకు రాలేదు.