300 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. ఎక్కడో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

300 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. ఎక్కడో తెలుసా?

April 22, 2022

25

భారతదేశంలో ప్రస్తుతం బుల్డోజర్ యుగం నడుస్తోంది. బుల్డోజర్ అంటే మనకు తెలిసి నివాసాలను కూల్చవేయటం, రోడ్ల పక్కనున్న చేట్లను పెరికివేయటం. గుంతలు తీయటం వంటివి తెలుసు. కానీ, ఈ మధ్య బుల్డోజర్లు ఏం చేస్తున్నాయి? ఎక్కడ కూల్చివేతలకు పాల్పడుతున్నాయి? అనే చర్చ దేశవ్యాప్తంగా విపరీతంగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో నిన్న, మొన్నటి వరకు అక్రమ కట్టడాలు, నివాసాలపైకి మాత్రమే వెళ్లిన బుల్డోజర్… తాజాగా ఒక గుడిని కూల్చేయడం చర్చనీయాంశమైంది. రాజస్తాన్‌లోని అల్వాజ్ జిల్లాల సరై మొహల్ల గ్రామంలో 300 ఏళ్ల క్రితం నాటి ఒక గుడిని బుల్డోజర్‌తో కూల్చేయడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనపై సరై మొహల్ల నగర పంచాయతీ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్‌, అల్వార్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, స్థానిక ఎమ్మెల్యే రాజ్‌ఘర్‌లపై పోలీసు కేసు నమోదైంది.

మరోపక్క రాజస్తాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గుడిని కూల్చేస్తున్న వీడియోను బీజేపీ ఐసీ సెల్ విభాగం ఇంచార్జ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘కరౌలీ, జహంగిర్‌పురిలో జరిగిన దానికి కన్నీళ్లు పెట్టుకున్న వారే ఇప్పుడు హిందువుల నమ్మకాన్ని దెబ్బ తీశారు. ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న సెక్యూలరిజం’’ అని విమర్శలు గుప్పించారు.