పెద్ద నోట్ల రద్దు ఓ పెద్ద విఫల ప్రయోగం అనేది ఇప్పుడు ప్రపంచం చెప్తున్న మాట. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్ని ఈ నిర్ణయంతో దునియా మొత్తం పాఠాలు నేర్చుకోవాలంటూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్లూంబర్గ్ వార్తా సంస్థ సంపాదీకయంలో పేర్కొన్నది. కేంద్రంలోబిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని మారుస్తామని చెప్పింది. నల్లధనం బయటకు తెస్తామనీ చెప్పింది. ఆ తర్వాత ఇంకా చాలా చాలా విషయాలు చెప్పింది. అందుకే పెద్ద నోట్ల రద్దు చేసింది.
దీన్నే ఆ వార్తా సంస్థ ప్రజల విశ్వాసం లేకుండా, ఎట్లా చేయాలో ఏ ప్లానూ లేకుండా నోట్లు రద్దు చేస్తే జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా ఉదహరించింది. నెలలకు నెలలు జనం రోడ్లపైనే ఉన్నారు. అయినా సహనంతో ఉన్నారు. మోడీ ఏదోచేస్తాడని అనుకున్నారు. చివరకు జరిగిందేమిటీ అంటే మనదేశంలో నోట్ల రద్దు వల్ల సుమారు 50 లక్షల మంది ఉద్యోగాలు గల్లంతయ్యాయట. అంతే కాదు వేల సంఖ్యలో పరిశ్రమలు మూత పడ్డాయి. నల్లధనం దేశంలో లేదని ఉన్నా అది బయటకు తీయలేక పోయారని రుజువు అయింది.
పెద్దలే బ్యాంకులను ముంచుతున్నారని అరుణ్ జైట్లీ చెప్తున్నారు. ఈ విషయాన్ని ముందే ఎందుకు గుర్తించ లేదో మరి. బ్యాంకుల ఆర్థిక నిర్వహణ, అప్పులు, మొండి పద్దుల వల్లనే భారత్ లో ఆర్థిక నిర్వహణ ఇబ్బంది కరంగా ఉందనేది ప్రపంచ ఆర్థిక నిపుణులుచెప్తున్న మాట. ఇదేమాట బ్లూబ్ బర్గ్ చెప్పింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రపంచం పాఠాలు నేర్చుకుంటున్నా మోడీ మాత్రం అలాంటిదేమీ లేదన్నట్లుగానే ఉన్నారు.
పెద్ద నోట్ల రద్దుతో ప్రయోజనం లేదని తెల్సిన తర్వాత వెంటనే నగదు రహిత లావాదేవీలు అంటున్నారు. జీఎస్టీలు అంటున్నారు. ఎన్ని చెప్పినా జనం రెండేళ్ల డెలప్మెంట్ వెనక్కి పోయింది. దీని వల్ల వృద్ది రేటుతో పాటు లక్షల కోట్ల సంపదా అవిరైందనేది విశ్లేషకుల అంచనా. నోట్ల రద్దుకు ముందు ఏ మాత్రం అధ్యయనం చేసినా ఇంత నష్టం జరిగేది కాదు. అయితే పెద్ద నోట్లు రద్దు వల్ల కొంతలో కొంత డిజీటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి. ఇదే ఇక్కడ చెప్పుకోదగ్గ…. సంతోషించ దగ్గ అంశం. ఇక మోడీ, తన ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.