నోట్లరద్దుతో లాభపడింది చైనానే.. - MicTv.in - Telugu News
mictv telugu

నోట్లరద్దుతో లాభపడింది చైనానే..

December 2, 2017

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వ్యవస్థాగత నేరమని, ఘోర తప్పిదమని గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మళ్లీ ఈ అంశంపై స్పందించారు. నోట్లరద్దు, జీఎస్టీలతో దేశ ప్రజలకు నిజానికి ఒరిగిందేమిలేదని, వాటివల్ల మన పొరుగు దేశమైన చైనానే ఎన్నో ప్రయోజనాలు పొందిందని వివరించారు.  మన్మోహన్ గుజరాత్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం సూరత్ సభలో మాట్లాడారు. నోట్ల రద్దు ఫలితంగా.. గత రెండేళ్లలో భారత్ చైనా నుంచి దిగుమతులు భారీగా పెరిగాయని ఆయన మండిపడ్డారు. దీంతో మన సొమ్మంతా చైనాకు వెళ్లిపోయిందన్నారు.  నల్లధనాన్ని వెలికితీస్తానన్న మోదీకి సెల్యూట్ చేస్తున్నానని, అయితే నోట్ల రద్దుతో నల్లధనం కాస్త వైట్‌ మనీగా మారిందని చురక అంటించారు. ఎవరినీ సంప్రదించకుండా, ఏకపక్షంగా అనాలోచితంగా తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయం వలల్ల ప్రజలు చెప్పలేనన్ని కష్టాలలుపడ్డారని, వందమందికిపైగా క్యూల్లో నిలబడి చచ్చిపోయారని మాజీ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.