హెచ్చరిక.. డెంగీకి ఆ మాత్రలు వాడితే డేంజర్! - MicTv.in - Telugu News
mictv telugu

హెచ్చరిక.. డెంగీకి ఆ మాత్రలు వాడితే డేంజర్!

September 7, 2019

Dengue fever.

తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొన్నిచోట్లు అపరిశుభ్రత, ఇతర కారణాల వల్ల డెంగీ లాంటి జ్వరాలు సోకుతున్నాయి. అయితే కొందరు మామూలు జ్వరమేనని మెడికల్ షాపులకు వెళ్లి సొంత ప్రయోగాలు చేస్తున్నారు. ఆస్పిరిన్, ఐబూఫ్రొఫెన్  మాత్రలే వేసుకుంటున్నారు. కానీ ఇలా చేయడం చాలా తప్పని, పరిస్థితి విషమించి ప్రాణాలు పోవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దోమకాటుతో వచ్చే డెంగీ సాధారణ జ్వరమేనని, వారం పదిరోజుల్లో తగ్గిపోతుందని వైద్యలు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే మొదట వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని, సొంతంగా మాత్రలు వాడకూడదని చెబుతున్నారు.

డెంగీ లక్షణాలు

తీవ్ర జ్వరం, తల నొప్పి, ఒళ్లునొప్పులు, శరీరంపై దద్దుర్లు , అతి దాహం, వాంతులు. వ్యాధి కారణంగా శరీరంలో ప్లేట్లెట్లు తగ్గుతాయి. కొన్ని కేసులో జ్వరం లేకున్నాడెంగీ ఉంటుంది. 

జాగ్రత్తలు

జ్వరం ఒక రోజులో పోకపోతే అనుమానించాలి. ఆస్పత్రికి వెళ్లి  పరీక్షలు చేయించుకోవాలి. జ్వరం ఎక్కువగా ఉంటే తడిగుడ్డతో తుడుచుకోవాలి. తక్షణ ఉపశమనం కోసం పారాసెటమాల్ మాత్ర వేసుకోవచ్చు. కొబ్బరినీళ్లు, పళ్ల రసాలు, ఎలక్ట్రోలైట్స్ ద్రవాలు తాగాలి. 

నివారణ ఇలా..

చుట్టుపక్కల దోమలు లేకుండా చూసుకోవాలి. దోమతెరలు వాడాలి. మస్కిటో కాయిల్స్, రీఫిల్స్, అగరువత్తులు వాడాలి. నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి. టాయిలెట్ కు వెళ్లాక చేతులు కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. పొడిబట్టలు వాడాలి.