Dengue, Malaria..included in Arogyasree: Vidadala Rajani
mictv telugu

డెంగ్యూ, మలేరియాను..ఆరోగ్యశ్రీలో చేర్చాం: రజనీ

September 20, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాల్గవరోజు అసెంబ్లీ సమావేశాలు కాసేపటిక్రితమే ప్రారంభమైయ్యాయి. సమావేశాల్లో భాగంగా మంత్రి విడదల రజనీ రాష్ట్ర ప్రజలకు ఓ శుభవార్తను చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న డెంగ్యూ, మలేరియా వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చామని వెల్లడించారు. దీంతో నిరుపేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే ఖర్చు లేకుండా వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆమె తెలియజేశారు.

సభలో మంత్రి విడదల రజనీ మాట్లాడుతూ..”రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న విష జ్వరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నాం. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం . విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాం. డెంగ్యూ, మలేరియాను ఆరోగ్య శ్రీలో చేర్చాం. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో డబ్బులు దుబారా చేసింది. చిన్నారి సంధ్య మృతి ఘటన బాధాకరం. వైరల్ డిసీజ్‌తో ఆ చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతిని అదునుగా చేసుకొని టీడీపీ సభ్యులు రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆమె అన్నారు.

మరోపక్క నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్..విద్యా, వైద్యం, నాడు-నేడుపై చర్చించనుంది. అంతేకాదు, నేడు ఏడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. శాసనసభ ముందుకు 85 పేజీల ఆధారాలతో కూడిన పెగాసెస్ నివేదిక ప్రవేశపెట్టనుంది.