ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు - MicTv.in - Telugu News
mictv telugu

ఐడీ కార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు

November 29, 2019

మనుషుల్లో సహనం క్షీణీస్తోంది. చిన్న చిన్న కారణాలతో పెద్ద పెద్ద నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా హరిద్వార్‌లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. 

తనకు ఐడెంటిటీ కార్డును ఇవ్వలేదనే నెపంతో ఓ యువకుడు ఏకంగా రైలు బోగీకే నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో రైలు సీట్లు దగ్దమయ్యాయి.రైలు బోగి నుంచి మంటలు రావడం గమనించిన పోలీసులు వెంటనే మంటలు ఆర్పారు. ఢిల్లీ నుంచి రిషీకేశ్ వెళ్లే పాసింజర్ రైల్లో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. “నాకు ఐడీ కార్డు ఇవ్వలేదు. అందువల్లే నేను రైలు కోచ్‌కి నిప్పు పెట్టి, సీట్లను చించివేశాను” అని నిందితుడు పోలీసు విచారణలో అంగీకరించాడు. ఇక అతనికి గతంలో ఏదైనా క్రిమినల్ రికార్డు ఉందా? అనే కోణంలో లోతుగా విచారిస్తున్నామని హరిద్వారా అడిషనల్ ఎస్పీ మనోజ్ కుమార్ తెలిపారు.