Department of Postal has released details of vacancies region wise
mictv telugu

పోస్టాఫీసుల్లో లక్ష ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే

November 5, 2022

దేశంలోని నిరుద్యోగ యువతకు పోస్టల్ శాఖ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని 23 సర్కిళ్లలోని సుమారు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది. రీజియన్ల ఖాళీల వివరాలను వెల్లడించిన ఆ శాఖ.. వీటి భర్తీకి రీజియన్ల వారీగా త్వరలో నోటిఫికేషన్లు ఇస్తున్నట్టు తెలిపింది. పోస్టుమ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులున్నాయని వివరించింది. మొత్తం 98 వేల 83 పోస్టులలో పోస్ట్‌మెన్ ఉద్యోగాలు 59, 099, మెయిల్ గార్డులు 1445, ఎంటీఎస్ పోస్టులు 37, 539 ఉన్నాయని పేర్కొంది. తెలంగాణ సర్కిల్‌లో 1553 పోస్ట్‌మ్యాన్, 82 మెయిల్ గార్డులు, 878 ఎంటీఎస్ పోస్టులున్నాయి.

ఏపీ సర్కిల్లో 2289 పోస్ట్ మెన్, 108 మెయిల్ గార్డు, 1166 ఎంటీఎస్ ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ మెన్‌కు ఇంటర్, మిగతా పోస్టులకు టెన్త్ విద్యార్హతగా నిర్ణయించారు. అభ్యర్ధుల వయసు 18 – 32 మధ్య ఉండాలి. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. వివిధ ఉద్యోగాలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఈ నెలలోనే వెలువడుతాయని పోస్టల్ శాఖ వెల్లడించింది. డిసెంబర్ వరకు దరఖాస్తుల స్వీకరణ, జనవరిలో రాతపరీక్ష నిర్వహించనున్నారు. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన చేసి తుది ఎంపిక చేపడతారు. అభ్యర్ధులు పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు https://www.indiapost.gov.in/ వెబ్ సైటులో వివరాలు చూసుకోవాలని సూచించింది.