రైలు ప్రయాణీకులకు తీపి కబురు - MicTv.in - Telugu News
mictv telugu

రైలు ప్రయాణీకులకు తీపి కబురు

March 1, 2022

raiway

కరోనా వ్యాప్తి తగ్గడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ బోగీల్లో ఇప్పటి వరకు అమలు చేస్తున్న రిజర్వేషన్ పద్ధతిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అన్ని మెయిల్, ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లలో ఈ విధానం తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణీకులు కరోనాకు ముందు ఉన్నట్టు అప్పటికప్పుడు టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రయాణం చేయవచ్చు. 2019లో కరోనా కారణంగా రైల్వే శాఖ జనరల్ బోగీల్లోని సీట్లకు రిజర్వేషన్ విధానాన్ని వర్తింపజేసింది. సీట్లకు తగ్గట్టుగానే టికెట్లను జారీ చేస్తూ, రిజర్వేషన్ ఛార్జీ కింద రూ.20 లను వసూలు చేసింది. తాజా నిర్ణయంతో ఇది కూడా రద్దయిపోయింది.