ముఖ్యమంత్రి సహా ఇతర వీఐపీలు పర్యటించేటప్పుడు రవాణా శాఖ ఏర్పాటు చేసే కాన్వాయ్ బిల్లులు ఏపీలో భారీగా పేరుకుపోయాయి. గత మూడేళ్లలో ఈ బకాయిలు రూ. 17.50 కోట్లకు చేరుకున్నాయి. ఈ డబ్బు కోసం రవాణా శాఖ తాజాగా ప్రభుత్వానికి లేఖ రాసింది. బకాయిలను చెల్లించాలని కోరింది.
లేదంటే ఇకపై సీఎం సహా వీఐపీలకు కాన్వాయ్ ఏర్పాటు చేయలేమంటూ సూటిగా చెప్పేసింది. కాగా, కాన్వాయ్కి అయ్యే ఖర్చులను రవాణా శాఖకు ప్రభుత్వం చెల్లించాలి. కానీ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఖర్చులు ప్రభుత్వం నుంచి రవాణా శాఖకు తిరిగి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. కాగా, ఇటీవల సీఎం ఒంగోలులో పర్యటించినప్పుడు తిరుపతికి వెళ్తున్న ప్రైవేటు వాహనాన్ని మధ్యలో ఆపి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.