కరెంటు బిల్లు చూసుకుని ఆత్మహత్య.. ఎంతొచ్చిందంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

కరెంటు బిల్లు చూసుకుని ఆత్మహత్య.. ఎంతొచ్చిందంటే..

August 10, 2020

Depressed over Rs 40,000 as power bill, Nagpur man sets self on fire, family blames govt apathy for his death.

అసలే కరోనా భయంతో, లాక్‌డౌన్ కరువులో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటి సమయంలో సామాన్యులకు కరెంట్ బిల్లులు మరింత షాక్ ఇస్తున్నాయి. తన ఇంటికి వచ్చిన రూ.40 వేల కరెంట్ బిల్లు చూసి అతను షాక్ అయ్యాడు. అంత డబ్బు కట్టాల్సిందేనా అని ఆందోళన చెందాడు. అంత కట్టలేను కాబట్టి తనకు ఆత్మహత్యే శరణ్యం అనుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటు చేసుకుంది. నాగపూర్‌కు చెందిన 57 ఏళ్ల లీలాధర్ లక్ష్మణ్ గైధానీ ఇంటికి మూడు నెలల లాక్‌డౌన్ కాలానికి కలిపి రూ.40 వేల కరెంట్ బిల్లు వచ్చింది. 

ఈ బిల్లును చూడగానే లక్ష్మణ్‌కు గుండెలో దడపుట్టింది. అంతేసి బిల్లు రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకునేందుకు లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ, అధికారులు ఎవరూ ఆయనను పట్టించుకోలేదు. దీంతో అతను మరింత హైరానా చెందాడు. అధికారుల తీరు అతన్ని కృంగదీసింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మణ్ మృతి పట్ల ఎంఎన్ఎస్ పార్టీ సంతాపం తెలిపింది. ఎంఎన్ఎస్ పార్టీ నాయకుడు రాజ్ థాకరే లక్ష్మణ్ మృతిపై సానుభూతి వెలిబుచ్చారు. కరెంట్ బిల్లుల్లో తప్పులు దొర్లకుండా, పెంచిన బిల్లులను తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఫిర్యాదులు పరిష్కారం కాకముందే విద్యుత్ కనెక్షన్లు తొలగించొద్దని మహారాష్ట్ర విద్యుత్ బోర్డు తమ అధికారులకు ఆదేశించింది.