భర్త తిట్టాడని.. టిక్‌టాక్‌ చేస్తూ ప్రాణం తీసుకుంది..   - MicTv.in - Telugu News
mictv telugu

భర్త తిట్టాడని.. టిక్‌టాక్‌ చేస్తూ ప్రాణం తీసుకుంది..  

June 12, 2019

depressed wife serious step in tiktok

టిక్‌టాక్ ఇప్పుడు యూత్ ఫేవరేట్ యాప్. ఒక్క యూతే కాదు అన్నీ వయసుల వారు ఇందులో ఖాతాలు తెరుచుకున్నారు. సరదా సరదా వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. కుటుంబం అంతా కలిసి వీడియోలు చేయడంతో టిక్‌టాక్‌లో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే దానివల్ల మంచి ఎంతుందో చెడూ అంతే వుందని నిపుణులు చెబుతున్న మాట. కొందరు అదే పనిగా దాన్ని వ్యసనంగా

మార్చుకుంటున్నారు. దాన్నిసహించని భర్తలు భార్యలను హత్యలు చేస్తున్న ఘటనలు ఈమధ్య వెలుగు చూసిన విషయం తెలిసిందే. టిక్‌టాక్ మాయలో పడి భర్తను, కుటుంబాన్ని పట్టించుకోవడంలేదని తమిళనాడులో  ఓ భర్త, భార్యను హత్య చేశాడుే. ఆ ఘటన గురించి మరిచిపోకముందే అదే రాష్ట్రంలో వివాహిత టిక్‌టాక్ వీడియో చేస్తూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 

పెరంబూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త తిట్టాడన్న క్షణికావేశంతో  ఆమె టిక్‌టాక్‌ చేస్తూ విషం తాగింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆమె ప్రాణాలు దక్కలేవు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ద్రువీకరించారు. కాగా, ఆమె సూసైడ్ చేసుకున్న వీడియో టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.