రోగులు లేకపోవడంపై డిప్యూటీ సీఎం అసంతృప్తి - MicTv.in - Telugu News
mictv telugu

రోగులు లేకపోవడంపై డిప్యూటీ సీఎం అసంతృప్తి

April 22, 2022

29

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శుక్రవారం అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వివరాలు. నారాయణ స్వామి, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు కలిసి తిరుపతిలో ఆరోగ్యమేళా ప్రారంభించారు. అయితే ఆరోగ్య మేళాలో వైద్యులు, సిబ్బంది తప్ప రోగులు ఎవ్వరూ లేరు. దీంతో ఉప ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, ఆయన వాటిని తిరస్కరించారు. రోగులు రాకపోవడంపై వివరణలు నాకవసరం లేదంటూ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే కూడా అధికారులపై మండిపడ్డారు. రోగులు లేకుండా కార్యక్రమం ఏర్పాటు చేసింది అధికారులు, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.