కెమిస్ట్రీ పాఠాలు చెప్పిన డిప్యూటీ సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

కెమిస్ట్రీ పాఠాలు చెప్పిన డిప్యూటీ సీఎం

April 10, 2018

తెలంగాణ నేతలు టీచర్లు మారిపోతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలో సీఎం కేసీఆర్ తెలుగు సాహిత్యంపై పాఠాలు చెప్పడం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీలో ద్రవ్యవినియమ బిల్లుపై చర్చలో ఆయన ఆర్థికశాస్త్ర పాఠాలు చెప్పారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కూడా కెమిస్ట్రీ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. వరంగల్ జిల్లాలోని  హసన్‌పర్తి గురుకులం నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్లో ఆయన మంగళవారంపాఠాలు బోధించారు.

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఇస్తున్న కోచింగ్ వివరాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 26 సెంటర్లు పెట్టి ప్రభుత్వ జూనియర్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నామని శ్రీహరి తెలిపారు. ఒక్కో సెంటర్‌పై పోటీ పరీక్షల కోచింగ్ కోసం 15 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడేళ్లలో 577 గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. ఎంసెట్ ఎంసెట్‌తో పాటు ఐఐటి, జే.ఈ.ఈ, నీట్ పరీక్షలకు కూడా కోచింగ్ ఇస్తున్నామని అక్కడి అధ్యాపకులు చెప్పారు. పోటీ పరీక్షల తేదీ వరకు విద్యార్థులకు ఆయా పోటీ పరీక్షలకు నిపుణులతో కోచింగ్ ఇప్పిస్తున్నామన్నారు.