గుండెనొప్పితో కుప్పకూలిన డిప్యూటీ సీఎం అలీ - MicTv.in - Telugu News
mictv telugu

గుండెనొప్పితో కుప్పకూలిన డిప్యూటీ సీఎం అలీ

February 2, 2018

తెలంగాణ  ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన ఇంట్లో ఉన్నట్టుండి ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను  పలు ఈసీజీ, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు.  గుండె రక్తనాళాల్లో రెండు చోట్ల మూసుకుపోయినట్లు  గుర్తించారు. అనంతరం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, నాలుగు రోజులు చికిత్స అందించి తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామని డాక్టర్లు.