Deputy CM Narayana Swamy granted a house title to a Pawan Kalyan fan
mictv telugu

పవన్ కల్యాణ్ బ్యానర్.. అభిమానికి ఇంటి పట్టా మంజూరు

August 31, 2022

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ బ్యానర్ ఏర్పాటు చేసిన ఓ అభిమానికి న్యాయం జరిగింది. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మంజూరైన ఇంటి పట్టాను యువకుడికి ఇచ్చారు. వివరాల్లోకెళితే.. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం బుక్కాపట్నం ఎస్సీ కాలనీకి చెందిన సూరిబాబు అనే యువకుడు పవన్ కల్యాణ్ అభిమాని. గతంలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానంతో బ్యానర్ ఏర్పాటు చేశాడు. అయితే స్థానిక వైసీపీ నేతలు దాన్ని చూసి అతనిపై కక్ష కట్టి ఇంటి పట్టాను ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో గడప గడపకు కార్యక్రమానికి వచ్చిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఈ యువకుడు ఎదురుపడి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన అన్నకు పట్టా ఇచ్చి తనకు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికంతటికీ కారణం పవన్ కల్యాణ్ బ్యానర్ ఏర్పాటు చేయడమేనని స్పష్టం చేశాడు. దీంతో స్పందించిన నారాయణ స్వామి అక్కడికక్కడే సమస్యను పరిష్కరించారు. అధికారులను మందలించి వివక్ష కూడదని సూచించారు.