Deputy CM narayana swamy suspended Mushtipalle volunteer
mictv telugu

జగన్ పార్టీ గుర్తు సైకిల్!.. వాలంటీర్‌ను సస్పెండ్ చేసిన డిప్యూటీ సీఎం

July 30, 2022

ఏపీలో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వారికున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ముష్టిపల్లెలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వెళ్లారు. సుబ్బమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి అమ్మఒడి, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. దానికామె బ్యాంకర్లు అని సమాధానమిచ్చింది. వెంటనే అక్కడున్న కార్యకర్తలు అవి ఇస్తున్నది ముఖ్యమంత్రి జగన్ అని చెప్పించారు. మరి జగన్ పార్టీ గుర్తేమిటి? అని ప్రశ్నించగా, సైకిల్ అని బదులివ్వడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. దీంతో ఆగ్రహించిన డిప్యూటీ సీఎం అసహనానికి లోనయ్యారు. స్థానిక వాలంటీర్‌పై మండిపడ్డారు. అవగాహన కల్పించడంతో విఫలమైన వాలంటీర్‌ని వెంటనే తొలగించాలని ఎంపీడీవోను ఆదేశించారు.