డేరా అడ్డాలో  పీనుగల గుట్టలు - MicTv.in - Telugu News
mictv telugu

డేరా అడ్డాలో  పీనుగల గుట్టలు

September 7, 2017

రేప్ కేసులో 20 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న సచ్ సౌదా డేరా బాబా రామ్ రహీమ్  చేసిన ఘోరాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. తాజాగా టాటియా అనే జర్నలిస్ట్  ఒళ్ళు గగుర్పొడిచే నిజాలను బయట పెట్టాడు. ఆ ఆశ్రమంలో ఉన్నపళంగా తవ్వకాలు జరిపితే లెక్కలేనన్ని మనుషుల అస్తి పంజరాలు బయటపడతాయంటున్నాడు. ‘బాబా, ఆయన అనుచరులు ఎంతో మందిని భయపెట్టిన సందర్భాలను నేను కళ్ళారా చూసాను. అందులోకొచ్చే చాలా మంది భక్తుల చేత త్యాగ పత్రాల మీద సంతకాలు చేయించుకునేవాడు. ఆ పత్రంలో ‘ నేనిక్కడికి నా జీవితాన్ని అర్పించడానికొచ్చాను. నేను చనిపోతే నా చావుకు ఎవరూ కారకులు కాదు. నా కుటుంబ సభ్యులకు నాతో ఎలాంటి సంబంధం వుండదు’ అని ఉంటుంది.  ఇలాంటి పత్రాలపై 500 మంది భక్తులతో సంతకాలు తీసుకున్నారు’ అని టాటియా చెప్పారు.

బాబా తన నిజ స్వరూపం తెల్సిన వారిని బెదిరించడం, వినకపోతే చంపి ఆశ్రమంలోనే పాతి పెట్టడం వంటి దుశ్యర్యలకు పాల్పడేవాడని ఆరోపిస్తున్నాడు. అలాగే డేరా ఆశ్రమం కోసం ఎందరివో భూములు తీసుకుని  చాలా తక్కువ డబ్బులు చెల్లించాడని అన్నారు. తన మీదా, తన పత్రికా ఆఫీసు మీద కొన్నిసార్లు దాడి కూడా చేయించాడని టాటాయా తెలిపారు.