డేరా వారసురాలు హనీ ప్రీతే ! - MicTv.in - Telugu News
mictv telugu

డేరా వారసురాలు హనీ ప్రీతే !

August 28, 2017

డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ కు ఈరోజు శిక్ష ఖరారు కానున్న సందర్భంలో ఆయన ఆస్తులకు వారసులు ఎవరు ? అనే ప్రశ్నతలెత్తంది. అయితే ఆయన తన దత్త పుత్రికగా ప్రకటించిన హనీ ప్రీత్ సింగే తన ఆస్తి పాస్తుల వ్యవహారాలు చూస్కుంటుందని సమాచారం. వందల ఎకరాల్లో వున్న ఆశ్రమాలు, వేల కోట్ల ఆస్తులు, వివిధ రాష్ట్రాల్లో వున్న డేరా కేంద్రాలకు సంబంధించి పూర్తి వారసత్వ అధికారాలను హనీ ప్రీతే స్వీకరించనుందట.

అయితే ఈ మధ్య తన భర్త విశ్వాస్ గుప్తా మాత్రం ఈ తండ్రీ కూతుళ్లు అనబడే వీరి మధ్య అక్రమ సంబంధం ఉందని మీడియా ముందు చెప్పాడు. దాని గురించి కూడా ఓ పక్క విచారణ జరుగుతోంది. రాంరహీమ్ సింగ్ గతంలో మెసెంజర్ ఆఫ్ గాడ్ 1, 2 అనే రెండు సినిమాలు తీసి వాటిల్లో హనీకు అవకాశం ఇచ్చాడు. హనీ కూడా తన వ్యక్తిగత ఫేసుబుక్కు మాధ్యమంలో తన తండ్రి అత్యద్భుతమైన తండ్రి అని తను గొప్ప కూతురునని రాసుకోవడం విశేషంగా మారింది. రాం రహీమ్ బాబా ఆశ్రమంలో ఎవరి పాత్ర ఎలాంటిదో ఒక్కక్కటి బయటకు వస్తున్నాయి. ఈ విషయం ఇలా వుంటే గుర్మీత్  సంప్రదాయం ప్రకారం వివాహమాడిన హర్ జీత్ కౌర్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. మరి వాళ్ళు కాకుండా హనీ ప్రీత్ సింగ్ వారసురాలిగా ఎలా డేరా ఆస్తులను హక్కుదారు అవుతుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. చూడాలి కోర్టు తీర్పు తర్వాత డేరా సదనంలో ఇంకా ఎలాంటెలాంటి పరిణామాలు సంభవించనున్నాయో.!

ఈ విషయం ఇలా వుంటే గుర్మీత్  సంప్రదాయం ప్రకారం వివాహమాడిన హర్ జీత్ కౌర్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. మరి వాళ్ళు కాకుండా హనీ ప్రీత్ సింగ్ వారసురాలిగా ఎలా డేరా ఆస్తులను హక్కుదారు అవుతుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. చూడాలి కోర్టు తీర్పు తర్వాత డేరా సదనంలో ఇంకా ఎలాంటెలాంటి పరిణామాలు సంభవించనున్నాయో.!