Dera Chief Ram Rahim, Convicted For Rape, Gets Parole For A Month
mictv telugu

డేరా బాబాకు నెల రోజుల పెరోల్

June 17, 2022


డేరా బాబాగా పేరొందిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాజాగా పెరోల్ లభించింది. డేరా సచ్చా సౌదా ఆశ్రమం నిర్వహిస్తున్న డేరా బాబా.. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. దీంతో 2017 నుంచి హరియాణాలోని రోహ్‌తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రేప్ కేసుతోపాటు ఆయనపై హత్య కేసులు కూడా నమోదయ్యాయి.

కాగా తాజాగా ఆయనకు నెల రోజుల పెరోల్‌ లభించింది. దీంతో ఆయన శుక్రవారంనాడు హర్యానాలోని రోహ్‌తక్ జైలు నుంచి విడుదలయ్యారు. డేరాబాబాకు సంబంధిత అధికారుల సిఫారసుతో రోహ్‌తక్ డివిజనల్ కమిషనర్ 30 రోజుల రిమాండ్‌ మంజూరు చేసినట్టు హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ చౌతాలా తెలిపారు. ఉత్తరప్రదేశ్ భాగ్‌పట్‌లోని బర్నావాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమానికి డేరాబాబా వెళ్లాలనుకుంటున్నారని చెప్పారు.