అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన బుల్లెట్ ట్రైన్ పట్టాలు తప్పింది. రైలు గంటకు 350 కిమీ స్పీడుతో వెళ్తుండగా ప్రమాదం జరగడంతో డ్రైవరు అక్కడికక్కడే చనిపోయాదు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ట్విట్టర్ ద్వారా శనివారం వెల్లడించింది. వివరాల ప్రకారం.. నైరుతి ప్రావిన్స్ గుయాంగ్ నుంచి దక్షిణ ప్రావిన్స్ గ్వాంగ్జౌ వైపు వెళ్తున్న రైలు శనివారం ఉదయం 10.30 గంటలకు పట్టాలు తప్పింది. ఒక స్టేషనులో కొండచరియలు విరిగి పట్టాలపై పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రైలు పట్టాలు తప్పగా, ఏడు, ఎనిమిదవ కోచ్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రైలు డ్రైవరు అక్కడి కక్కడే మరణించాడు. మొత్తం 136 మంది ప్రయాణిస్తుండగా, వారితో తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.