ఆప్ రెండో మేనిఫెస్టో.. విద్య, ఆరోగ్యం, సురక్షిత నీరు - MicTv.in - Telugu News
mictv telugu

ఆప్ రెండో మేనిఫెస్టో.. విద్య, ఆరోగ్యం, సురక్షిత నీరు

February 4, 2020

App.

ఇంటింటికీ రేషన్‌ సరుకుల సరఫరా, పది లక్షల మంది సీనియర్‌ సిటిజన్లకు ఉచిత యాత్రా సౌకర్యం కల్పిస్తామని ఆప్ పార్టీ రెండో మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇప్పటికే తొలిభాగం పది హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండో భాగంలో పలు హామీలను ఆప్‌ తన మేనిఫెస్టోలో గుప్పించింది. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ఆప్ రెండో మేనిఫెస్టోను విడుదల చేయడం గమనార్హం. ఈ సందర్భంగా పార్టీలు అన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అధికార ఆప్‌ మంగళవారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. రానున్న ఐదేళ్లలో ఏం చేస్తామనేది రెండవ భాగంలో స్పష్టంగా పేర్కొన్నాం అని స్పష్టంచేశారు. దేశ రాజధాని ప్రజలందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షిత నీరు, 24 గంటల విద్యుత్‌ అందిస్తామని అన్నారు. 2015లో ఆప్‌ ప్రభుత్వం ఆమోదించిన ఢిల్లీ జన్‌ లోక్‌పాల్‌ బిల్లు నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని మనీష్ గుర్తుచేశారు. 

 

మేనిఫెస్టోలో ఉన్న మరికొన్ని అంశాలు:

 

-ప్రపంచ శ్రేణి రహదారుల నిర్మాణం

-యమునా నదీతీరంలో అభివృద్ధి పనులు

-ఢిల్లీ మెట్రో విస్తరణ

-యువతకు స్పోకెన్‌ ఇంగ్లీష్‌లో శిక్షణ

-పారిశుద్ధ కార్మికుల సంక్షేమ చర్యలు

-పాఠశాల విద్యలో ప్రవేశపెట్టిన హ్యాపీనెస్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కరిక్యులమ్‌ విజయవంతమైన క్రమంలో త్వరలో దేశభక్తికి సంబంధించిన సిలబస్‌ ప్రవేశం