తొలి దేశీ బ్రౌజర్ వచ్చేసింది..పేరు Bharat Browser - MicTv.in - Telugu News
mictv telugu

తొలి దేశీ బ్రౌజర్ వచ్చేసింది..పేరు Bharat Browser

June 23, 2020

Bharat

దేశవ్యాప్తంగా బాయ్ కాట్ చైనా ఉద్యమం ఊపందుకుంది. ప్రజలు మేడ్ ఇన్ చైనా వస్తువులను స్వచ్చందంగా బహిష్కరిస్తున్నారు. కొందరు చైనా మొబైల్ అప్లికేషన్స్ ను కూడా బహిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని దేశీయ మొబైల్ అప్లికేషన్స్ పుట్టుకొస్తున్నాయి. చైనా యాప్ TikTokకు ప్రత్యామ్నాయంగా భారతీయ యాప్‌లైన Mitron, Chinagari యాప్స్ లాంచ్ అయిన సంగతి తెల్సిందే. తాజాగా బెంగళూరు ఆధారిత బ్లూస్కై ఇన్వెన్షన్స్ స్టార్టప్ కంపెనీ ఈ దేశీయ ‘Bharat Browser’ ను లాంచ్ చేసింది.

భారత్ నుంచి తొలి బ్రౌజర్ కూడా ఇదే కావడం గమనార్హం. వివిధ భారతీయ భాషలను సపోర్టు చేసేలా ఈ బ్రౌజర్ ను రూపొందించారు. ఈ సందర్భంగా బ్లూస్కై ఇన్వెన్షన్స్ కో ఫౌండర్, సీఈఓ దినేష్ ప్రసాద్ మాట్లాడుతూ..’గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్నో బ్రౌజర్లు ఉన్నాయి. కానీ, వాటిలో ఒక్కటి కూడా నిజమైన భారతీయ బ్రౌజర్ లేదు. దేశంలో 500M+ నెటిజన్ల కోసం ఈ కొత్త బ్రౌజర్ ను అందుబాటులోకి తీసుకొచ్చాం. భారతీయ కంటెంట్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ భారత్ బ్రౌజర్ ప్రవేశపెట్టాం.’ అని తెలిపారు.  ఈ బ్రౌజర్ ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.