500 కోట్ల వ్యూస్ పాటపై తీవ్రవాదుల దాడి.. యూట్యూబ్ నుంచి మాయం - MicTv.in - Telugu News
mictv telugu

500 కోట్ల వ్యూస్ పాటపై తీవ్రవాదుల దాడి.. యూట్యూబ్ నుంచి మాయం

April 10, 2018

యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన స్పానిష్ పాట ‘డెస్పాసిటో’ హ్యాకర్ల బారిన పడింది. గుర్తుతెలియని వ్యక్తులు దీన్ని హ్యాక్ చేసి తొలగించారు. దీని స్థానంలో ముసుగు వ్యక్తులు తుపాకీ పట్టుకుని గరి చూస్తున్న థంబ్ నెయిల్ కనిపిస్తోంది. డెస్పాసిటోకు వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేని వ్యక్తులే దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఈ పాటను గత ఏడాది జనవరి 12న అప్ లోడ్ చేయగా 500 కోట్లమందికిపైగా చూశారు. ప్యూర్టోరికో సింగ‌ర్ లూయీస్ ఫొన్సీ పాడిన ఈ పాట వీడియోలో డాడీ యాంకీ న‌ర్తించారు. దీన్ని హ్యాక్ చేసిన వ్యక్తులు తమ పేర్లను ప్రోసోక్స్ అండ్ కురోయిష్ అని ప్రకటించుకున్నారు. పాలస్తీనాకు స్వేచ్ఛ(ఫ్రీ పాలస్తీనా) అని రాశారు. అయితే డెస్పాసిటో వీడియో కాపీలు కొన్ని ఇంకా యూట్యూబులో ఉన్నాయి. చాలావాటికి టైటిల్స్ మార్చారు. ఇది పాలస్తానా తీవ్రవాదుల పని కావొచ్చని, అయితే పూర్తి వివరాలను ఇప్పడు వెల్లడిండచం కష్టమని యూబ్యూబ్ ప్రతినిధులు చెబుతున్నారు.  

FILE