Home > Corona Updates > 'మాకు నమ్మకం లేదు దొర'..దేశాధ్యక్షుడికి నర్సుల చివాట్లు!

'మాకు నమ్మకం లేదు దొర'..దేశాధ్యక్షుడికి నర్సుల చివాట్లు!

fh.kth

కరోనా వంటి విపత్తులు వచ్చినప్పుడు పాలకులు ఎంతో బాధ్యతాయుతంగా ఉంటూ తమ దేశ ప్రజలను కాపాడుకోవాలి. అలాంటిది ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు. దీంతో నర్సులు అతడిని కడిగిపారేశారు. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఉన్న ఓ ప్రముఖ హాస్పిటల్ ను శుక్రవారం రోజున దేశాధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ పర్యటించారు. అక్కడి వైద్య సిబ్బందితో మాట్లాడాడు.

ఈ సందర్భంలో రక్షణ దుస్తుల లేక తీవ్ర ఇబ్బందులు పడుతోన్న కొందరు నర్సులు మాక్రాన్ ను చూడగానే ‘మీపై నమ్మకం పోయింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రక్షణ లేకుండా తాము కరోనాతో పోరాడుతుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఈ పర్యటనను మీడియా కవర్ చేసేందుకు ఆసుపత్రి వర్గాలు అనుమతించలేదు. కానీ, అక్కడ ఉన్న కొందరు తమ ఫోన్ లో నర్సుల ఆవేదనను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాక్రాన్ తీరు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.

Updated : 16 May 2020 10:44 PM GMT
Tags:    
Next Story
Share it
Top