తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలో కుండపోతగా వాన కురిసింది. ఎనిమిది జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళ, బుధ వారాల్లో కొన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తుందని వెల్లడించింది. కాగా రాష్ట్రంలో గురువారం అంటే ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ జరగాల్సి ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి పలు నిర్ణయాలు తీసుకుంది.
14 నుంచి జరగాల్సిన పరీక్షలు యధాతథంగా జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ నెల 14, 15 తేదిల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ , ఈ నెల 18, 19,20 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించిన హాల్ టికెట్లను అధికారులు తాజాగా విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ (https://eamcet.tsche.ac.in/) నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎల్లుండి 13 నుంచి జరగాల్సిన ఈ సెట్ పరీక్ష మాత్రం వాయిదా పడింది.