ఆధార్ కార్డుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ కార్డుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని తెలుసా?

July 5, 2022

భారత దేశంలోని పౌరులందరికీ ఆధార్ కార్డు ఉంటుంది. దీనికి చిన్నా పెద్దా, ఆడ మగ అనే భేదాలు ఉండవు. అయితే ఆధార్ కార్డుకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మనలో చాలా మందికి తెలియదు. ఆ టైంలోపు అప్‌డేట్ చేసుకుంటేనే ఆ కార్డు చెల్లుబాటు అవుతుంది. లేకపోతే ఇనాక్టివ్ అవుతుంది. అయితే ఏఏ సందర్భాలలో అలా జరుగుతుందో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మేజర్లయిన వారు ఆధార్ కార్డు తీసుకుంటే వాటికి ఎక్స్‌పైరీ ఉండదు. ఆ వ్యక్తి చనిపోతే అప్పుడు అతని ఆధార్ కార్డును కూడా రద్దు చేస్తారు. ప్రస్తుతం ఈ పద్ధతి తీసుకురాబోతున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల వెల్లడించారు. దీని వల్ల ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన. ఇదికాక, ఐదేళ్ల లోపు చిన్నారులు ఆధార్ కార్డు తీసుకుంటే వారికి 5 ఏళ్లు, 15 ఏళ్ల వయసులో వారి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారి ఆధార్ కార్డు చెల్లదు. ఐదేళ్ల తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటే 15 ఏళ్లు వచ్చినప్పుడు కేవలం ఒక్కసారే అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఉచితంగానే జరుగుతుంది. కాబట్టి మీ కుటుంబాల్లో ఎవరైనా ఈ స్టేజీలో ఉంటే వారి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోంది. మరిన్ని వివరాలకు సమీపంలోని ఆధార్ సెంటర్లో సంప్రదించండి.