Details about Black Taj Mahal in India
mictv telugu

మన దేశంలోనే ఉన్న నల్ల తాజ్‌మహల్ గురించి తెలుసా?

September 9, 2022

తాజ్ మహల్ అంటే మనందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉండే ఈ తెల్ల తాజ్ మహల్ ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరు గాంచింది. 1632లో నిర్మాణం ప్రారంభమవగా, పూర్తవ్వడానికి 20 ఏళ్లు పట్టింది. మొఘల్ రాజు షాజహాన్ తన భార్యకు గుర్తుగా కట్టిన ఈ కట్టడం పాలరాతితో యమునా నది ఒడ్డున నిర్మితమైంది.

తర్వాత షాజహాన్ మరణించాక ఆయనను కూడా ఇక్కడే ఖననం చేశారు. 1983లో యునెస్కో గుర్తింపు లభించింది. అయితే మన దేశంలోనే నల్ల తాజ్ మహల్ ఉన్న విషయం చాలా మందికి తెలియదు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్ పూర్‌లో కాలా తాజ్ మహల్ ఉంది. 1622లో పూర్తి నల్లరాతితోదీనిని నిర్మించారు. అప్పటి మొఘల్ ఆర్మీ కమాండర్ అయిన షాహ్ నవాజ్ ఖాన్ 44 ఏళ్లకే మరణించడంతో ఆయనను ఉతవాలీ నది ఒడ్డున ఖననం చేశారు. తర్వాత ఆయన భార్య చనిపోయాక ఆమెను కూడా ఇక్కడే సమాధి చేశారు. అచ్చం తాజ్ మహల్‌ను పోలి ఉండే ఈ నల్ల తాజ్ మహల్ సైజులో మాత్రం చిన్నదే. నలుదిక్కులా మినార్లతో పాటు లోపల అద్భుతమైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. దీంతో దీనిని చూడడానికి పర్యాటకులు వస్తుంటారు. మీరు చూడాలనుకుంటే బుధవారం తప్ప మిగతా రోజులలో వెళ్లవచ్చు. సందర్శన వేళలు మాత్రం ఉదయం 9 నుంచి 5 గంటల వరకే ఉంటుంది.