ఏపీలో రీపోలింగ్ జరిగే కేంద్రాలు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో రీపోలింగ్ జరిగే కేంద్రాలు ఇవే..

April 17, 2019

అల్లర్లు, హింసతో కంగాళీగా మారిన ఏపీ ఎన్నికల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐదు కేంద్రాల్లో పోలింగ్ సరిగ్గా జరగలేని, వాటిలో మళ్లీ రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులు కేంద్రానికి లేఖ రాశారు.  గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రెండు చోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌కు సిఫారసు చేశారు. అయితే ఆ ఐదు కేంద్రాలు ఏవన్నదీ తెలియకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరదింపుతూ ఈసీ అధికారులు వాటి వివరాలను వెల్లడించారు.

Details of re-polling centers in Andhra Pradesh election each two in Guntur and Nellore and one in prakasham district.

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం 94వ పోలింగ్‌ కేంద్రం, గుంటూరు పశ్చిమ స్థానం నల్లచెరువులోని 244వ కేంద్రం,  నెల్లూరు జిల్లా పల్లెపాలెంలోని ఇసుకపల్లి 41వ కేంద్రం, సూళ్లూరు పేటలోని అటకానితిప్ప 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కలనూతల 247వ పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరుపుతున్నట్లు  ఓ ప్రకటనలో తెలిపారు. హింస, రిగ్గింగ్, ఈవీఎల మొరాయింపు తదితర కారణాల వల్ల 5 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి గోపాలకృష్ణ ద్వివేది… నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.