స్వార్థం లేని బాతు..పిల్లాడికి సాయం.. (వీడియో)
ఓ చిన్నపిల్లాడికి బాతు చేసిన సహాయం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనిషికంటే నోరులేని ఆ మూగజీవే మేలు అని జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అది స్వార్థం లేని బాతు అని అంటున్నారు.
విషయంలోకి వస్తే.. ఫిలిప్పీన్స్’లోని క్యూజోన్ రాష్ట్రంలోని గ్రామంలో ఓ పిల్లాడు పంట పొలాల్లో ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటూ ఓ ఎత్తుగడ్డ ఎక్కుతున్న సమయంలో తన చెప్పు కింద పడింది. దానిని ఎలా తీసుకోవాలో ఆ కుర్రాడికి అర్థం కాలేదు. అక్కడే ఉన్న ఓ బాతు ఇదంతా గమనించింది. అక్కడికొచ్చి పిల్లాడి చెప్పును అతి కష్టమ్మీద అతడి చేతికి అందించింది. ఈ క్రమంలో మూడు సార్లు చెప్పు కింద పడినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఆ చెప్పును కుర్రాడికి అందించింది. ఈ దృశ్యాన్ని మైలా అగిలా అనే మహిళ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిస్వార్థంగా ఆ కుర్రాడికి సహాయం చేసిన ఆ బాతుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.