టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ నటించారు. చాలా కాలంగా ఈ మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న సినీ అభిమానులకు ఇటీవల సమంత అప్ డేట్ ఇచ్చేసింది. తాజాగా సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాగా, ఆదివారం డబ్బింగ్ కంప్లీట్ అయినట్లు సమంత ఇన్ స్టా గ్రామ్ వేదికగా తెలిపింది. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో దుష్యంతుడిగా నటిస్తున్న దేవ్ మోహన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ ఫస్ట్ లుక్ లో దుష్యంతుడు.. గుర్రంపై కనిపించి అందరినీ కనివిందు చేస్తున్నాడు. పోస్టర్లో అడవిలో గుర్రపు స్వారీ చేస్తున్న రాజుగా, మనోహరంగా మరియు పరాక్రమంగా కనిపిస్తున్నాడు.
Wishing our ever-charming, valiant and handsome King #Dushyant, @ActorDevMohan a very Happy Birthday! ⚔️🤍#Shaakuntalam @Gunasekhar1 @Samanthaprabhu2 #ManiSharma @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official @tipsofficial #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/pfAvfLUWnq
— Gunaa Teamworks (@GunaaTeamworks) September 18, 2022
ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత సమంత నటిస్తున్న శాకుంతలం సినిమా నుంచి అప్ డేట్ రావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా విడుదల తేదీ కూడా త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. ఈ భారీ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు మరియు గుణ టీం వర్క్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.