సంక్రాంతి బరిలో నిలిచి భారీ హిట్ కొట్టి వీరనరసింహారెడ్డి అనుకోకుండా చిక్కులో పడ్డాడు. నందమూరి బాలకృష్ణ ఓ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని దేవాంగులు డిమాండ్ చేస్తున్నారు. తమ కులాన్ని ఎగతాళి చేయడం ఆయనకు సరికాదని అంటున్నారు.
బాలయ్య ఇటీవల ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ దేవాంగ కులాన్ని ప్రస్తావించారు. దేవబ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారికి నాయకుడు రావణాసురుడని చెప్పుకొచ్చారు. అంతటితో ఊరుకోకుండా రావణాసురుడిలా వికటాట్టహాసం చేస్తూ లకలకలకలక నవ్వారు. దీనిపై ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నేత తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మండిపడ్డారు. చరిత్రతో, గొప్పవ్యక్తులతో, దేవతలతో ముడిపడి ఉన్న తమ కులం గురించి బాలయ్య ఇలా గేలి చేయడం సరికాదని, ఆయన తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కోరారు.