సీఎం భార్యనూ వదల్లేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం భార్యనూ వదల్లేదు..

December 13, 2017

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతపై ఆరెస్సెస్, వీహెచ్పీ తదితర హిందుత్వ వాదులు విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఆమె పేదపిల్లతో కలసి క్రిస్మస్ కేక్ కట్ చేసినందుకు నిప్పులు చెరుగుతున్నారు. అసలు ఆమె హిందువేనా? ఆమె గత చరిత్రి ఏంటో చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు. వారికి ఆమె కూడా దీటుగా బదులిచ్చింది.  ఇటీవల `బీసాంటా`ఎఫ్‌.ఎం చానల్ నిరుపేద పిల్లకు కానుకలు అందించిన కార్యక్రమంలో సీఎం భార్య పాల్గొన్నారు. వారితో లిసి కేక్ ట్ చేశారు. ఫోటోలను ట్వీట్ చేశారు. దీంతో హిందుత్వ వాదులు భగ్గుమన్నారు. ఆమెపై  ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. ‘నువ్వు అసలు హిందువేనా? నీ గత చరిత్ర ఏంటో చెప్పు..  పెళ్లికాక ముందు క్రైస్తవరాలివి అయ్యుంటావు.. అందుకే అక్కడికి వెళ్లావు.. మోసం చేసి దేవేంద్రను పెళ్లాడావు.. నువ్వు కిరస్తానీ కార్యక్రమాల్లో పాల్గొంటే దేవేంద్రకు మంచిది కాదు. ఆయన బీజేపీలో పైకి రాలేరు.. నువ్వు ఆ కిరస్తానీ వాళ్ల వద్దకు వెళ్లకుండా దీపావళి, దసరా పండగులు చేసుకో.. ’ అని ట్వీటారు.

అభిమానానికి మతం లేదు..

దీనికి అమృత ఘాటుగా బదులిచ్చారు. `ప్రేమకు , అభిమానానికి తం లేదు. మనం మంచి ఎక్క ఉన్నా స్వీకరిద్దాం. చెడు భావకు, నులకు దూరం ఉందాం.. నేను ఒక  హిందువును అయినందుకు గర్విస్తున్నాను. చాలామందిలాగే నేనూ మన దేశంలో చేసుకునే  ప్రతి పండుగను జరుపుకుంటాను. ఇది వ్యక్తిగత ఇష్టానికి సంబంధించినది. మన జాతీయ స్ఫూర్తికి మనం ప్రాతినిధ్యం వహించాలి. అంతమాత్రన మన దేశం, మతం, మానవత్వం నుంచి వెనుకకు తగ్గినట్టు కాదు` అని హితవు పలికారు.