devendra, swapna and shilpa arrested by nia in connection with maoists in Hyderabad
mictv telugu

మావోయిస్టులతో సంబంధాలు.. లాయర్ శిల్పతోపాటు మరో ఇద్దరు అరెస్ట్

June 23, 2022

devendra, swapna and shilpa arrested by nia in connection with maoists in Hyderabad

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌) నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు లాయర్ శిల్పను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. నర్సింగ్‌ విద్యార్థిని రాధ అదృశ్యం కేసులో విచారణ జరుపుతోన్న ఎన్ఐఏ అధికారులు.. హైదరాబాద్‌ ఉప్పల్‌తో పాటు మెదక్‌ జిల్లా చేగుంట, మేడిపల్లి పర్వతాపూర్‌లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేశారు.
ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రంగారెడ్డి, మెదక్, సికింద్రాబాద్‌లో ఎన్‌ఐఏ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో డిజిటల్ సామగ్రి, మావో భావజాల సామగ్రి స్వాధీనం చేసుకుంది. మావోయిస్టు అనుబంధ సంస్థతో దేవేంద్ర, స్వప్న, శిల్పకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. చైతన్య మహిళా సంఘంలో ఈ ముగ్గురూ పనిచేసినట్లు ఎన్ఐఏకు ఆధారాలు లభించాయి. యువత నక్సల్స్‌లో చేరేలా ముగ్గురు ప్రోత్సహించారని ఎన్ఐఏ తేల్చింది. పెదబయలులో ఈ ఏడాది జనవరి 3న ముగ్గురిపై కేసు నమోదు కాగా… ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. గురువారం ఎన్‌ఐఏ వీరిని అదుపులోకి తీసుకుంది.