మూడో పెళ్లి చేసుకున్న దేవి సినిమా హీరోయిన్‌పై కేసు  - MicTv.in - Telugu News
mictv telugu

మూడో పెళ్లి చేసుకున్న దేవి సినిమా హీరోయిన్‌పై కేసు 

June 29, 2020

devvi

‘దేవి’ సినిమా హీరోయిన్ వనితా విజయ్  కుమార్‌కు ఊహించని షాక్ తగిలింది. పీటర్ పాల్ అనే వ్యక్తిని ఆమె ఇటీవల మూడో పెళ్లి చేసుకోవడంతో ఈ జంటపై కేసు నమోదు అయింది. పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు విడాకులు ఇవ్వకుండానే ఈ పెళ్లి చేసుకున్నారని కేసు పెట్టడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. పెళ్లి జరిగిన ఒక్కరోజులోనే ఈ ఘటన జరగడంతో సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

కాగా వనితా విజయ్ కుమార్ తన మొదటి భర్త ఆకాష్‌తో 2007లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకొని అక్కడ కూడా విడాకులు తప్పులేదు. తాజాగా ఈ నెల 27న పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చెన్నై లోని ఓ ఫంక్షన్ హాల్‌లో క్రిస్టియన్ వివాహ పద్దతిలో జరిగింది. కరోనా సమయం కావడంతో కుటుంబ సభ్యుల సమక్ష్యంలోనే ఇది జరిగింది. ఆమె తన మూడో భర్తకు ముద్దులు పెడుతూ దిగిన ఫొటోలు వైరల్ కావడంతో ఇది చూసిన మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది.