పిరికి దెయ్యంగా తాప్సీ ! - MicTv.in - Telugu News
mictv telugu

పిరికి దెయ్యంగా తాప్సీ !

August 16, 2017

ఇప్పటి వరకు దెయ్యాలతో మనుషులు భయపడే సినిమాలనే చూసాం. కానీ ‘ ఆనందో బ్రహ్మ ’ సినిమా మాత్రం రివర్స్ లో మనిషికే దెయ్యం భయపడే డిఫరెంటు పాయింటుతో వస్తోంది. తాప్సీ ప్రధాన పాత్రలో మహి వి. రాఘవ దర్శకత్వంలో వస్తోంది ఈ హర్రర్ కామెడీ సినిమా. భయానికే నువ్వంటే భయం అనే ట్యాగ్ లైన్ తో డిఫరెంటు ప్రెజెంటేషన్ తో వస్తోంది ఈ సినిమా. తాప్సీ గతంలో ‘ గంగ ’ అనే సినిమాలో దెయ్యం పాత్ర చేసి మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాలో అదే తరహా పాత్రలో కనిపించనుంది.

కాకపోతే పిరికి దెయ్యంగా అన్నమాట. 18 ఆగస్ట్ 2017 కు విడుదల అవుతున్న ఈ సినిమా మీద అప్పుడే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. మహి గతంలో ‘ పాఠశాల ’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

అయితే దెయ్యాల మీద ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. చంద్రముఖి, అరుంధతిల తర్వాత వరుసగా అలాంటి సినిమాలే రావడం గమనార్హం అయింది. ఏ సినిమాలో చూసినా దెయ్యాలు చాలా కర్కషంగా వుంటూ మనుషులను భయపెట్టేస్తుంటాయి. కానీ ఆమధ్య నిఖిల్ నటించిన ‘ ఎక్కడికి పోతావు చిన్నవాడా ’ సినిమాలో మంచి దెయ్యాన్ని చూపించాడు దర్శకుడు. అదొక ప్రయోగమని చెప్పొచ్చు. మరి ఈ ఆనందో బ్రహ్మ కూడా ఎలాంటి సినిమానో, ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో ఈ 18 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.