టీడీపీకి దేవినేని అవినాశ్ రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీకి దేవినేని అవినాశ్ రాజీనామా

November 14, 2019

టీడీపీకి మరో షాక్ తగిలింది. ఒకవైపు ఆ పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడలో ఇసుక దీక్ష చేపడుతోన్న సమయంలో ఆ పార్టీ యువనేత, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఆయనతో పాటు కడియాల బచ్చిబాబు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. 

 

Devineni avinash.

ఈరోజు సాయంత్రం ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. టీడీపీలో తనకు తగిన గుర్తింపు లభించడంలేదని అవినాశ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో చేరే విషయంపై ఇప్పటికే ఆయన తన అనుచరులతో చర్చించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.