devotee gifted three golden crowns to Durgamma
mictv telugu

కనక దుర్గమ్మకి మూడు బంగారు కిరీటాలు కానుక.. బరువెంతంటే

September 12, 2022

devotee gifted three golden crowns to Durgamma

విజయవాడ కనక దుర్గమ్మ వారికి ఓ భక్తుడి నుంచి భారీ కానుక అందింది. ముంబైకి చెందిన భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా ఇచ్చారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలంకరణ కోసం మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన జి. హరికృష్ణారెడ్డి అనే అమ్మవారి భక్తుడు కిరీటాలను ఆలయ ఈవో భ్రమరాంబకు అందజేశారు.

ఈ మూడు కిరీటాల బరువు 1308 గ్రాములు. అనంతరం హరికృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోగా, ప్రధానఅర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ ఈవో దాతకు అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేష వస్త్రం అందజేశారు.