అమ్మవారికి దండం.. కిరీటానికి ఎసరు..(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మవారికి దండం.. కిరీటానికి ఎసరు..(వీడియో)

November 21, 2019

గుడికొచ్చి దేవుడికి మొక్కకుండా ఆ దేవుడికే శఠగోపం పెట్టాడు ఓ దొంగ భక్తుడు. ఎప్పుడు తన కన్ను పడిందో ఏమో కానీ భక్తి ముసుగులో వచ్చి దొంగ దండాలు పెట్టాడు. గుంజీలు తీస్తూ, చుట్టూ తిరుగుతూ మంచిగా నటించి అమ్మవారి వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. సికింద్రాబాద్ లోని గన్ ఫౌండ్రీ దుర్గా భవాని ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఈ తతంగం అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దొంగను పట్టుకునే పనిలో ఉన్నారు. 

అమ్మవారి గుడికి ఈనెల 20న ఓ భక్తుడు వచ్చాడు. దండం పెడుతున్నట్టుగా నటించి ఎవరూ లేని సమయాన్ని చూశాడు. చుట్టు పక్కల ఎవరు లేకపోవడంతో అర కిలో బరువు ఉన్న వెండి కిరీటాన్ని తన ప్యాంటులో పెట్టుకొని పారిపోయాడు. కొంత సేపటికి  పూజారి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్లగా కిరీటం కనిపించలేదు.వెంటనే ఆలయ నిర్వాహకులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని విలువ రూ.30 వేలకుపైనే ఉంటుందని చెబుతున్నారు.