రాంచరణ్ ఫ్యాన్స్ తొక్కిన దుర్గగుడి హుండీలకు సంప్రోక్షణ - MicTv.in - Telugu News
mictv telugu

రాంచరణ్ ఫ్యాన్స్ తొక్కిన దుర్గగుడి హుండీలకు సంప్రోక్షణ

May 4, 2022

టాలీవుడ్ హీరో, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇటీవల ఆచార్య సినిమా విడుదలకు ముందు విజయవాడ దుర్గగుడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి గుడిలోని హుండీలపైకి ఎక్కి మరీ హీరోను చూసేందుకు ఎగబడ్డారు.

ఆలయంలో ఉన్నామన్న సంగతి మరచిపోయి హంగామా చేశారు. జై రాంచరణ్ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు, ఫోటోలు బయటికి రావడంతో భక్తులు రాంచరణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపచారం జరిగిందని ఆందోళన చెందారు. బాధ్యులపై తగిన చర్యలను తీసుకోవాలని అధికారులను కోరారు. అయితే తాజాగా అభిమానులు తొక్కిన ఆలయ హుండీలను అధికారులు పండితులతో కలిసి సంప్రోక్షణ చేశారు.