అంబులెన్స్ కోసం శోభాయాత్రనే నిలిపేశారు - MicTv.in - Telugu News
mictv telugu

అంబులెన్స్ కోసం శోభాయాత్రనే నిలిపేశారు

September 13, 2019

అంతా వినాయక ఊరేగింపులో బిజీగా ఉన్నారు. ఏ సౌండు వినిపించనంత శబ్ధంతో డ్యాన్స్ చేస్తున్నారు. అదే సమయంలో కుయ్ కుయ్ అంటూ అంబులెన్స్ వస్తోంది. ఆ శబ్ధం విన్న వెంటనే అంతా ఒక్కసారిగా క్రమశిక్షణగా రోడ్డు పక్కకు వెళ్లిపోయారు. అంబులెన్స్ వెళ్లే వరకు దారి ఇచ్చి తర్వాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆసక్తికర ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకుంది. ఇది చూసిన వారంతా వారి క్రమశిక్షణకు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

లక్ష్మీ రోడ్డులో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. అదే సమయంలో  ఓ అంబులెన్స్ అక్కడికి వచ్చింది. ఆపదలో ఉన్న వ్యక్తిని త్వరగా ముందుకు తీసుకెళ్లేందుకు దారి కనిపించలేదు. ఈ విషయం గమణించిన ప్రజలు మానవత్వంతో వ్యవహరించారు. అంతా ఒక్కసారిగా పక్కకు జరిగి రోడ్డును క్లియర్ చేశారు. వందలాది మంది రోడ్డుపై ఉన్నా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఒక్కసారిగా పక్కకు జరిగి  తమ మానవత్వాన్ని చాటుకున్నారు.