గాంధీకి లేఖ రాయండి..రూ. 50 వేలు గెలుచుకోండి - MicTv.in - Telugu News
mictv telugu

గాంధీకి లేఖ రాయండి..రూ. 50 వేలు గెలుచుకోండి

November 13, 2019

ఇన్‌ల్యాండ్ లెటర్ ఈ పేరు ఇప్పటి తరం వారికి పెద్దగా పరిచయం లేకపోయి ఉండవచ్చు. కానీ ఒకప్పుడు దూరంగా ఉన్నవారికి సమాచారం చేరవేయాలంటే దీన్నే మాధ్యమంగా వాడేవారు. అలాంటి లెటర్ తాజాగా మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది. ‘డాయి అఖర్’ పేరుతో తపాలా శాఖ పోటీలను నిర్వహిస్తోంది. ఈ లేఖల పోటీల్లో గెలిచిన వారికి భారీ బహుమతులు కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. సీనియర్ సూపరింటెండెంట్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. 

ఈ లేఖను మహాత్మా గాంధీ పేరు మీద ‘ప్రియమైన బాపూ.. మీరు అమరులు’  అంటూ ఆయను ఉద్దేశించి ఉత్తరం రాయాల్సి ఉంటుంది. అన్ని భాషలవారు జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ లేఖల పోటీల్లో పాల్గొనవచ్చు. ఇన్ ల్యాండ్ లెటర్‌పై 500 పంక్తులకు మించకుండా సొంత దస్తూరితో రాయాలి. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 లోపు వచ్చే లేఖలను మాత్రమే వీటిని స్వీకరిస్తున్నారు. ఇంకా 20 రోజులు మాత్రమే గడువు ఉండటంతో పోటీల్లో పాల్గొనాలనుకునే వారు ఆలోగా లేఖలు పంపాలని తపాలా అధికారులు కోరుతున్నారు.  

Letter.

ఎ4 సైజు పేపర్‌లో రాసి పోస్ట్ చేయాలని అనుకునే వారికి కూడా అవకాశం కల్పించారు. అయితే దీనిపై వెయ్యి పంక్తులకు మించకుండా రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పోటీలకు అన్ని వయస్సుల వారు అర్హులే అని తెలిపారు.  జాతీయ,రాష్ట్రస్థాయిలో విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నారు. రాష్ట్రస్థాయిలో అయితే మొదటి బహుమతి రూ. 25 వేలు, రెండవ బహుమతి రూ. 10 వేలు, మూడవ బహుమతి రూ. 5 వేలు ఇవ్వన్నారు. ఇక జాతీయ స్థాయి పోటీలకు మొదటి బహుమతికి రూ.50వేలు, రెండవ బహుమతి రూ.25వేలు,మూడవ బహుమతి 10వేలు చెల్లించనున్నారు.