ధమాకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దుమ్ముదులుపుతున్నాయి. త్రినాధ రావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ డ్రామా ధమాకా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి వారంలోనే డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలని తీసుకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం ధమాకా 14 రోజుల విజయవంతమైన రన్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్‌ను దాటింది. ఈ సందర్భంగా ధమాకా ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ఈ విషయాన్నీ ధృవీకరించింది. ధమాకా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.19 కోట్లు అయ్యాయి. రూ.20 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అనుకుంటే.. ఏకంగా సినిమా దాదాపు రూ.60 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రవితేజ కెరీర్లోనే ఇదే బిగ్గెస్ట్ హిట్ అని మార్కెట్ వర్గాల సమాచారం.
ఇక పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల ధమాకాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రొటీన్ కథాంశమే అయినా పూర్తి మాస్ అంశాలు ఉండటం, థియేటర్స్ లో మరో పెద్ద సినిమా లేకపోవటం, పల్సర్ బైక్ పాట హిట్ అవ్వటం వంటి అంశాలు ధమాకాకి బాగా కలిసొచ్చాయి. ఇక
రవితేజ నటన, అతని డైలాగ్ డెలివరీ, స్టైల్ ధమాకాకి మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఎప్పటి నుండి ఆశిస్తున్న అసలు సిసలు హిట్ రావటంతో మాస్ మహారాజ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక రవితేజ కెరీర్లోనే ఫస్ట్ టైమ్ ధమాకా మూవీతో హండ్రెడ్ క్రోస్ క్లబ్ హీరోగా మారటం విశేషం.