dhamaka movie worldwide collection
mictv telugu

రవితేజ కెరీర్ లో పెను సంచలనం.. ఒక్క వారంలో 60కోట్లా ?

December 30, 2022

dhamaka movie worldwide collection

మాస్ మహారాజ రవితేజ హీరోగా.. త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ దెగ్గర అనూహ్యంగా వసూళ్లని రాబడుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలవ్వగా.. మొదటి రోజు నుండే పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తుంది. మాస్ కమర్షియల్ రెగ్యులర్ చిత్రాలకు కాలం చెల్లిందన్న ప్రచారాన్ని కొట్టిపడేస్తూ కోట్ల వర్షం కురిపిస్తుంది ధమాకా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ వీక్ లోనే లాభాల బాటపట్టింది. ‘ధమాకా’ ఐదో రోజున 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరగా.. ఆరు రోజులకు 56 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి.. ఏడో రోజు మరో 6 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

ఇక ఫస్ట్ వీక్ మొత్తం మీద చూస్తే… 62 కోట్లు కలెక్ట్ చేసింది ధమాకా. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర ధమాకాకి బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రూ. 19.00 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ధమాకా.. తొలివారంలోనే రూ. 23.58 కోట్ల షేర్స్ వసూల్ అయ్యాయి. అంటే ఫస్ట్ వీక్ లోనే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.58 కోట్లు లాభాలు కూడా సొంతం చేసుకుంది ధమాకా. ఈ చిత్రం ఆరు రోజుల్లోనే రూ. 50 కోట్లు గ్రాస్ మార్కును చేరుకొని రవితేజ కెరీర్‌లోనే వేగంగా ఈ మైలురాయిని చేరిన చిత్రంగా సరికొత్త రికార్డు సాధించింది. దీనికి తోడు ఈ మూవీ వరుసగా ఆరు రోజులు కోటి రూపాయలకు పైగానే షేర్‌ను రాబట్టి సత్తా చాటింది.