ధన్ రాజ్ ఎగ్జిట్.... - MicTv.in - Telugu News
mictv telugu

ధన్ రాజ్ ఎగ్జిట్….

August 27, 2017

బిగ్ బాస్ షో నుండి ధన్ రాజ్ ఎగ్జిట్ అయ్యారు. ఎవరు హౌజ్ లో నుండి బయటకు పోయినా విలపించే ధన్ రాజు బయటకు పోయాడు. జనాల నుండి వచ్చిన ఎస్ ఎంఎస్ రెస్సాన్సో లేక పోతే మరే కారణాలున్నాయో తెలియదు కానీ ధన్ రాజు మాత్రం బయటకు వచ్చాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు సరే సరి. అయితే ఇంతకు ముందు బయటకు వచ్చిన వారికి ధన్ రాజుకు చాలా తేడా ఉంది.  బిగ్ బాస్ సీజన్ వన్ బహుమతి ధన్ రాజ్  లేదా శివబాలాజీ గెల్చుకుంటారని అంతా అనుకున్నారు.  హౌజ్ లో నుండి బయటకు వచ్చిన వారు కూడా ఇదే మాట చెప్పారు. అనుహ్యూంగా ధన్ రాజ్ బయటకు రావడంతో ఇక శివబాలజీ మాత్రమే మిగిలారు కాంపిటీషన్లో.

మరి ధన్ రాజ్ ఎందుకు బయటకు వచ్చాడే వెంటనే సమాధానం చప్పక పోవచ్చు. అయితే హౌజ్ లో నుండి బయటకు వచ్చిన వారు టీవీ ఛానెళ్లల్లో సమాధానం ఇస్తున్నారు. ఈయన గురించి కూడా అట్లాగే తెల్సుకోవాలి కావొచ్చు.  మరిక  హౌజ్ లో ఉన్న వారిలో మంచి కాంపిటీటర్ ఎవరు అంటే శివబాలాజీ అనే చెప్తారు. కొత్త వారు కూడా యాడ్ అవుతున్నారు. ముందు ముందు ఎవరు  ఎగ్జిట్ అవుతారో తెలియదు.

జనాలు తమ గురించి తాము తెల్సుకోవడానికి ఈ షో పెట్టారని చెప్తున్నారు. అందులో ఉన్న వారు నటిస్తున్నారో… లేక  నటిస్తూ జీవిస్తున్నారో  తెలియదు కానీ… రేటింగ్ మాత్రం బాగా పెంచుకుంటున్నారు. అందులో నటించే ప్రతీ ఒక్కిరికీ  బెయిలీ వేజ్ చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అందుకే అంతుచిక్కని పంచాయితీలు చిల్లర డ్రామాలు ఆడుతున్నారనే విమర్శలూ ఉన్నాయి.

ఇక ధన్ రాజ్ విషయంలో తానే వెళ్లాలని అనుకున్నాడో లేక పోతే  దీని కంటే జబర్దస్త్ లో మరిన్ని డబ్బులు వస్తాయని భావించాడో… జనాలే ఈయన బాధలు హౌజ్ లో చూడ లేక ఓట్లు తక్కువ వేశారో తెలియదు. కానీ ధన్ రాజ్ మాత్రం బయటకు వచ్చాడు.  మరి ఇంతలా హౌజ్ లో షోను రక్తి కట్టించే వారు ఎవరొస్తారో చూడాలి. ఇప్పటికే షో స్టార్ట్ అయి రెండు నెలలు కావొస్తున్నది.  విజేత ఎవరో తేలడానికి ముందు  బిగ్ బాస్ చాలా ట్విస్టులు ఇస్తున్నాడు. చివరకు బిగ్ బాస్ ఏం చేస్తాడో మరి. అయితే షో  సాంతం డ్రామా అనే అభిప్రాయం జనాల్లో వచ్చే విధంగా ఉంది ఈ స్టోరీ అంతా మరి.